7 May, 2026 | 12:57 AM

‘ఇంటర్’ను రద్దు చేయాలని చూస్తే ఊరుకోం

07-05-2026 12:23 AM
  1. నిర్ణయాన్ని సీఎం వెంటనే వెనక్కి తీసుకోవాలి
  2.  ఇంటర్ విద్యా జేఏసీ  

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలని చూస్తే ఊరుకొబోమని ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డా.పి.మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నాంపల్లిలోని అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఇంటర్ విద్యను పూర్తిగా రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చూడడం అత్యంత దౌర్భాగ్యమైన దినంగా ఈ రోజు భావిస్తున్నామన్నారు.

పలువురు అధికారులు, తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ కలిసి విద్యా వ్యవస్థను బొందపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఎవరితో చర్చించకుండా ఈ ఇంటర్ విద్యావ్యవస్థను రద్దు చేయడం తుగ్లక్ చర్యగా భావిస్తు న్నామన్నారు. సీఎం నిర్ణయం వెనక్కి తీసుకోకుంటే  ఆందోళనలు చేపడుతామ ని ఆయన హెచ్చరించారు.

1969-1970 విద్యా సంవత్సరంలో పీవీ నర్సింహరావు.. విద్యలో లోటు పాట్లను సరిచేయాలని కొఠారి కమిషన్ సిఫా ర్సు మేరకు ప్లస్ టు విద్యను రాష్ట్రంలో అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. సీఎం  ఇంటర్ విద్యా వ్యవస్థలో తీసుకున్న చ ర్యతో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని, రేవంత్ రెడ్డిని గద్దె దించేవరకు తమ పోరా టం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు.