11 March, 2026 | 3:30 AM

వడ్డెరల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం

11-03-2026 01:38 AM
  1. జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు పీట్ల శ్రీధర్ 
  2. ప్రగతి నగర్ నుంచి బాచుపల్లి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ 
  3. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ 

కుత్బుల్లాపూర్, మార్చి 10(విజయక్రాంతి): కులం పేరుతో వడ్డెరలను దూషిం చడం అత్యంత హేయమైన చర్య అని, ఇటువంటి కుల అహంకారపూరిత విమర్శలను ఏమాత్రం సహించేది లేదని జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షులు పీట్ల శ్రీధర్ అన్నారు. ప్రగతి నగర్కు చెందిన వడ్డెర కులస్తుడు ఉప్పు జస్వంత్ను రాములు నాయక్ అనే వ్యక్తి ఇష్టానుసారంగా బూతులు తిడుతూ, కులం పేరుతో కించపరచడంపై వడ్డెర సం ఘం ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ ఘటనను నిరసిస్తూ మంగళవారం ప్రగతి నగర్ నుండి వందలాది మంది వడ్డెర కులస్తులు, సంఘం నాయకులు భారీ ర్యాలీగా బాచుపల్లి పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. కుల వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్ళిన అనంతరం, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ సతీష్కు ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా పీట్ల శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా వడ్డెర కులస్తులకు ఎక్కడ అన్యాయం జరిగినా, వారు ఏ మూలన ఇబ్బందుల్లో ఉన్నా జాతీయ వడ్డెర సంఘం ముందుండి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జాతీయ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వల్లెపు శివకుమార్, పీట్ల మల్లేష్, ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, జాతీయ వడ్డెర సంఘం యువజన అధ్యక్షులు భరత్, జాతీయ కార్యదర్శి పల్లె కృష్ణ, కుత్బుల్లాపూర్ వడ్డెర సంఘం నాయకులు లింగస్వామి, రాష్ట్ర కార్యదర్శి జెరుపటి రాజు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి బోదాస్ రవి, జాతీయ నాయకులు తన్నీరు వెంకట్రావు, షణ్ముఖ రాజు, దండుగుల స్వామి, స్థానిక వడ్డెర సంఘం నాయకులు పాల్గొన్నారు.