30 June, 2026 | 8:37 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

ఎస్పీడీసీఎల్ ముట్టడి

11-03-2026 01:40 AM
  1. మింట్‌కౌంపౌండ్‌లో ఆర్టిజన్ కార్మికుల ఆందోళన
  2. సమస్యలు తీర్చకుంటే సమ్మె తప్పదు
  3. రెండ్రోజుల్లో నోటీసులు ఇస్తాం 
  4. ఆర్టిజన్లను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి
  5. ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలి
  6.   9 సంఘాల విద్యుత్ జేఏసీ

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): తెలంగాణ విద్యుత్ రంగంలో వెన్నెముకగా నిలుస్తున్న ఆర్టిజన్ కార్మికులు తమ హక్కుల సాధనకై పోరుబాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్క రించడంలో అనుసరిస్తున్న మొండివైఖరికి నిరసనగా మంగళవారం మింట్‌కౌంపౌండ్‌లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయాన్ని వేలాది మంది కార్మికులు ముట్టడించారు.

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహాధర్నా రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. మరో రెండు రోజుల్లో తమ సమస్యలపై స్పష్టమైన హామీ రాకపోతే సమ్మె నోటీసు ఇచ్చి, రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సేవలను నిలిపివేస్తామని జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సచివాలయం సమీపంలోని ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ముందు ఉదయం నుంచే ఉద్రిక్తత నెలకొంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 33 జిల్లాల నుంచి వేలాది మంది ఆర్టిజన్ కార్మికులు తరలి వచ్చి కార్యాలయ ప్రధాన గేటు వద్దే బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అధికారులు, సిబ్బంది రాకపో కలు నిలిచిపోయాయి. టీఈఈయూ-327, టీఆర్పీకేఎస్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్, బీఎంఎస్ వంటి మొ త్తం 9 సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఈ పోరాటాన్ని నిర్వహించాయి.

వెట్టి కార్మికులుగా చూస్తారా?

జేఏసీ చైర్మన్ సతీష్‌రెడ్డి, కన్వీనర్ సాయి లు మాట్లాడుతూ.. దశాబ్దాలుగా విద్యుత్ శాఖను నమ్ముకుని ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న ఆర్టిజన్లను యాజమాన్యాలు వెట్టి కార్మికులుగా చూస్తున్నాయని మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వా లని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా, చట్టాలు చెపుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది అని ధ్వజమెత్తారు.

నెల రోజుల క్రితమే సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా, కనీసం చర్చలకు కూడా పిలవకపోవడం వారి అహంకారానికి నిదర్శనమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్హత లకు అనుగుణంగా ఆర్టిజన్లను విద్యుత్ శాఖ శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రస్తుత స్టాండింగ్ ఆర్డర్స్ రద్దు చేసి, ఏపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని 1600 మంది ఆర్టిజన్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని, కనీస వేతనాలు, ఈఎస్ ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించాలని కోరా రు.

యాజమాన్యం తమతో చర్చలు జరిపి డిమాండ్లను పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని జేఏసీ నేతలు సంతోష్, చంద్రారెడ్డి, చందర్ సింగ్ స్పష్టం చేశారు. మరో రెండు రోజులు వేచి చూస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సమ్మెకు దిగుతామని, తద్వారా కలిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు తేల్చిచెప్పారు.