2 May, 2026 | 1:11 PM

Breaking News

అత్తను హెల్మెట్‌తో కొట్టి చంపిన అల్లుడు... పట్టించిన సీసీటీవీ ఫుటేజ్   •   వెలిమినేడు నోష్ ల్యాబ్ వద్ద కార్మికుల ధర్నా   •   ‘ప్రజాదర్బార్’లో ప్రజల సమస్యలకు పరిష్కారం – ప్రజల వద్దకే పాలన   •   శంషాబాద్ ORR ప్రమాద మృతులకు కేటీఆర్ నివాళి   •   లక్షల ఫోన్లలో ఒకేసారి సైరన్ శబ్దం   •   విజయ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. గంటల తరబడి వేచి ఉన్న అభిమానులు   •   ప్రియుడు మోసం చేశాడని.. పోలీస్ స్టేషన్‌పై నుంచి దూకేసిన యువతి   •   రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్‌పై కేసు నమోదు   •   బెంగాల్‌లో రీపోలింగ్: తొలి 2 గంటల్లో 16.23 శాతం ఓటింగ్   •   వడ్లు కొనుగోలులో జాప్యం.. రాఘవాపూర్ చౌరస్తాలో రైతుల ధర్నా   •  

అనుమతుల ప్రక్రియలో జాప్యం వద్దు

11-03-2026 01:35 AM

పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన పరిష్కరించాలి

సీఎంసీ కమిషనర్ జీ సృజన

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 10 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయడంపై కమిష నర్ జీ సృజన దృష్టి సారించారు. మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. భవన అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడం నుంచి అక్రమ నిర్మాణాల నియంత్రణ వరకు పలు కీలక అంశాలపై అధికారులకు ఆమె స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల విషయంలో ఉదాసీనత వహించవద్దని, తక్షణ పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్పొరే షన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న భవన అనుమతులు, కోర్టు కేసుల వివరాలను కమిషన ర్ ఆరా తీశారు.

అనుమతుల ప్రక్రియలో ఎక్కడా జాప్యం జరగకూడదని, నిబంధనల ప్రకారం దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.   లేఅవుట్ రెగ్యుల రైజేషన్ స్కీమ్ కింద వచ్చిన దరఖాస్తుల పురోగతిని ఆమె సమీక్షించారు. బాధితులకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని  ఆదేశించారు.