17 April, 2026 | 3:00 PM

ప్రజా సేవలో విఫలమైతే సహించబోం

10-06-2025 12:40 AM

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి  

నల్లగొండ టౌన్, జూన్ 9 : ప్రజలకు న్యాయమైన సేవలు అందించడంలో ఏ విఫలమైతే సహించబోమని తెలంగాణ రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అధికారులను హెచ్చరించారు.

సోమవారం ఆ మంత్రి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం, ఆర్డిఓ కార్యాలయాన్ని  పరిపాలన పరిస్థితులు, అధికారుల పనితీరు పై  ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  మంత్రి  ఫైళ్లను పరిశీలించి,అధికారులను ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా విని,తగిన సూచనలు కూడా ఇచ్చారు. జిల్లా అభివృద్ధిలో ప్రతి అధికారికుడు తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని మంత్రి  అన్నారు..ఈ ఆకస్మిక తనిఖీలు జిల్లా పరిపాలనలో జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి, ప్రజల నమ్మకాన్ని పెంచడానికి దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు