17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఇద్దరు ఎస్‌ఐలకు సీఐగా పదోన్నతి

10-06-2025 12:40 AM

అభినందించిన ఎస్పీ పరితోష్ పంకజ్

సంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్‌ఐలకు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతిని కల్పిస్తూ మల్టీ జోన్ 2 ఐజి వి.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. 2012లో పోలీసు శాఖలో సబ్-ఇన్స్పెక్టర్స్ గా నియామకమైన వెంకట్ రెడ్డి, ప్రసాద్ రావు గడిచిన గడిచిన 13 సంవత్సరాలుగా ఉమ్మడి మెదక్ జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్ లలో ఎస్‌ఐలు గా విధులు నిర్వహించి, విశిష్ట సేవలందించినట్లు తెలిపారు.

ప్రస్తుతం వెంకట్రెడ్డి సిర్గాపూర్ ఎస్‌ఐగా, ప్రసాదరావు జహీరాబాద్ రూరల్ ఎస్‌ఐగా పనిచేశారు. సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేకుండా అధికారుల మన్ననలు పొందారని, వీరు అందించిన ఉత్తమ సేవలకు గాను సీఐలుగా పదోన్నతి కలిస్తూ ఉత్తర్వులు వెల్లడించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఎస్పీ అభినందించారు.