19 April, 2026 | 3:55 AM

మౌలిక సదుపాయాలు కల్పిస్తాం

01-06-2025 12:00 AM

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): తెలంగాణలో మౌలిక సదు పాయాల కల్పనకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి శనివారం ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర ఉపరితల రవాణా శాఖ హైదరాబాద్ కీలకమైన ప్రాజెక్టులు చేప ట్టిందని గుర్తుచేశారు. అంబర్‌పేట ఫ్లు ఓవర్, ఆరాంఘర్- శంషాబాద్ 6 లేన్ ఫ్లు హైవే, బీహెచ్‌ఈఎల్ ఫ్లు ఓవర్ పనులు పూర్తి చేసిందన్నారు. మూడు ప్రాజెక్టుల ద్వారా నగరంలో ట్రాఫిక్ రద్దీ బాగా తగ్గిందన్నారు.