11 May, 2026 | 9:53 PM

Breaking News

వైభవంగా వేంకటేశ్వర స్వామి రథయాత్ర   •   ఇంటికి లేటుగా వస్తున్నాడని తండ్రి మందలింపు... కుమారుడు అదృశ్యం   •   మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు – ఎస్సై ప్రశాంత్ రెడ్డి   •   దేవాలయ భూములకు సర్వే   •   బ్యాంకు లింకేజీలో పెద్దపల్లి జిల్లాకు రాష్ట్రస్థాయి అవార్డు   •   తాగివచ్చావని తల్లి మందలింపు... మనస్తాపంతో తనయుడి అదృశ్యం   •   గురు సంకల్పం ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతకు ప్రోత్సహం   •   చట్టవ్యతిరేక కార్యకలాపాలకు నిర్వాహకులదే బాధ్యత   •   నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించమని కోరిన ఎమ్మెల్యే జారె   •   మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే   •  

అధిక ధరలు వసూలు చేస్తే సీజ్ చేస్తాం

18-06-2025 12:00 AM

సంగారెడ్డి తహసీల్దార్ జయరాం నాయక్ 

సంగారెడ్డి, జూన్ 17: మీసేవ కేంద్రాల్లో ప్రజల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తే కేంద్రాన్ని సీజ్ చేస్తామని సంగారెడ్డి తహసిల్దార్ జయరాం నాయక్ హెచ్చరించారు. మంగళవారం ఆయన సంగారెడ్డి మండలం, పట్టణంలో గల కల్వకుంట దారిలో శ్రీ సాయి కమ్యూనికేషన్ మీ సేవ సెంటర్, బాపు గ్రాఫిక్స్ మీ సేవ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు.

అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ధరల ను మాత్రమే వసూలు చేయాలని, అధిక ధరలు వసూలు చేస్తే మీ సేవ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెట్టి సిజ్ చేయడం జరిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంకేతిక విభాగం ఉదయ్, మండల గిర్ధవర్ ప్రవీణ్ రెడ్డి, మీ సేవ నిర్వాహకులుపాల్గొన్నారు.