18-06-2025 12:00:00 AM
మునగాల, జూన్ 17 : కోదాడ శాసనసభ్యురాలు నలమాధ ఉత్తమ్ పద్మావతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం మండల కేంద్రంలోని ఫ్లై ఓవర్ వద్ద కేక్ కట్ చేసిన అనంతరం రిక్షా కార్మికులకు బీసీ సంఘం అధ్యక్షులు చింతకాయల నాగరాజు ఉ చితంగా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అండగా నిలవాలని లక్ష్యంతో ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా రిక్షా కార్మికులకు దుస్తు లు అందించామన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, మా జీ ఎంపీటీసీ ఉప్పల రజిత జానకి రెడ్డి, ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ గౌడ్, బైక్ మెకానిక్ శ్రీనివాసరెడ్డి, మండవ శ్రీను వీరభద్ర, ఎల్.ఈధరావ్, మట్టయ్య.తదితరులుపాల్గొన్నారు.