13-06-2025 01:57:11 AM
సిద్దిపేట, జూన్ 12 (విజయక్రాంతి): పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్కూల్ బస్సులను తనిఖీ చేశామని మోటారు వెహికల్స్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ తెలిపారు. గురువారం సిద్దిపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేసి వాహనాల పనితీరు ఫిట్నెస్ పొల్యూషన్ వంటి ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను అరికట్ట వచ్చాన్నారు. ఒక్క రోజుతోనే కాకుండా నిరంతరం వాహనాల తనిఖీలు కొనసాగుతాయన్నారు.