29 June, 2026 | 1:50 AM

హస్మత్‌పేట్ సర్వే నెంబర్ బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తాం

29-06-2026 12:54 AM
  1. అక్రమ స్థలాలను విక్రయించిన బ్రోకర్లు, సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
  2. మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్

సికింద్రాబాద్, జూన్ 28 (విజయక్రాం తి): ఓల్డ్ బోయిన్ పల్లి హస్మత్ పేట్  చత్రీగడ్డ సర్వే నంబర్ 1 లో  చేపట్టిన కూల్చివేతల అంశంపై  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదేశాల మేరకు ఓల్డ్  బోయిన్‌పల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్  మాట్లాడుతూ చట్టవిరుద్ధంగా ఆక్రమణలు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదు అన్ని తెలియజేస్తూ, అయితే అమాయక ప్రజలను తప్పుదారి పట్టించి అక్రమ స్థలాలను విక్రయించిన బ్రోకర్లు, సంబంధిత వ్యక్తులపై ప్రభుత్వం కఠిన చ ర్యలు తీసుకోవాలని నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.

చట్టబద్ధమైన స్థలమని నమ్మి జీవిత పొదుపులతో స్థలాలు కొనుగోలు చేసిన అమాయక కుటుంబాలు నేడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వారికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ కోరారు. గతంలో కొందరు ప్రభావశీలులు (నవాబులు) ఈ స్థలాలను విక్ర యించినట్లు ఆరోపణలు ఉన్నాయని, సం బంధిత పత్రాలు, ఆధారాలు బాధితుల వద్ద ఉంటే వాటిని సేకరించి, జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని తెలిపారు.

అంతే కాకుండా, ఇళ్లను కోల్పోయిన అర్హులైన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించి వారి పునరావాసానికి చర్యలు తీసు కోవాలని ముద్దం నరసింహ యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ పోరాటంలో బాధితులకు కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్ని వి ధాలా అండగా ఉంటారు అన్ని తెలియజేస్తూ, మాజీ కార్పొరేటర్ ముద్దం నరసిం హ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో మేకలహరినాథ్, ఇర్ఫాన్, సిహెచ్ పోచయ్య,యాదగిరి పాల్గొన్నారు.