30 June, 2026 | 10:59 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

రైతులకు అండగా ఉంటాం

27-02-2026 01:12 AM

నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగల వర్షం వల్ల నష్టపోయిన రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సోన్ మామడా లక్ష్మణ్ చందా మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన పంటలను సందర్శించి రైతులతో మాట్లాడారు.

వ్యవసాయ శాఖ అన్ని గ్రామాల్లో సర్వే చేసి నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిహెచ్ మాజీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి నాయకులు పండి లింగన్న సతీష్ రెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు.