23 June, 2026 | 1:28 AM

పోలీస్ అభ్యర్థులకు అండగా ఉంటాం

23-06-2026 12:47 AM
  1. బీజేఎల్పీ నేత ఏలేటి
  2. ఆయనకు పోలీస్ నిరుద్యోగ జేఏసీ వినతి

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): తెలంగాణ పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతామని, వారికి అండగా ఉంటామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు ఆయనను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందన్నారు. ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జీవో నెం.46 సవరణ, వయోపరిమితి పెంపుపై గాంధీభవన్ వేదికగా హామీలు ఇచ్చిన రేవంత్‌రెడ్డి... ఇప్పుడు నిరుద్యోగులను విస్మరించారని ఆయన విమర్శించారు.