23 June, 2026 | 1:37 AM

ముగిసిన టెట్

23-06-2026 12:48 AM

 1,15,028 మంది హాజరు

 38,724 మంది గైర్హాజరు

 ఈనెల 30న టెట్ కీ 

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): టెట్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 30న ప్రాథమిక కీను విడుదల చేయనున్నారు. ఈనెల 16 నుంచి 22 వరకు జరిగి న టెట్ పరీక్షలకు మొత్తంగా 1,53,752 మంది దరఖాస్తు చేసుకోగా, 1,15,028 (74.81 శాతం) మంది పరీక్షలకు హాజరైతే 38,724 మంది గైర్హాజరయ్యారు. పేపర్ 1 పరీక్షకు 72.10 శాతం, పేపర్2 మ్యాథ్స్ సైన్స్ విభాగంలో 75.21 శాతం, పేపర్2 సోషల్ స్టడీస్‌లో 77.33 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. 30న కీని విడుదల చేసి, జూలై 2 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.