30 June, 2026 | 10:05 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అతి చేసే అధికారులపై చర్యలు తీసుకుంటాం: కేటీఆర్

22-04-2025 05:55 PM

హైదరాబాద్: 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్(Telangana Bhavan) లో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ వ్యవహార శైలిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పుపట్టిందని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక తర్వాతైనా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.

పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుపట్టిందని, బాధ్యులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన వెల్లడించారు. బాధ్యులైన పోలీసులను తొలగించకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపివేయాలని, మూడేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమ వ్యక్తం చేశారు. అతి చేసే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ సూచించారు.