20 March, 2026 | 9:09 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

వల్లభనేని వంశీకి షాక్‌.. రిమాండ్ పొడిగింపు!

22-04-2025 03:44 PM

అమరావతి,(విజయక్రాంతి): సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత వల్లభనేని వంశీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు ఆయన రిమాండ్‌ను మరోసారి పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వు జారీ చేసింది. వల్లభనేని వంశీ మునుపటి రిమాండ్ కాలం నేటితో ముగియనున్నందున ప్రాసిక్యూషన్ తరపు న్యాయవాది ఆయన కస్టడీని పొడిగించాలని పోలీసుల తరపున కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు అంగీకరించి రిమాండ్‌ను మే 6 వరకు కొనసాగించాలని తీర్పునిచ్చింది. వల్లభనేని వంశీతో పాటు, మరో నలుగురు నిందితుల రిమాండ్‌ను కోర్టు మే 6 వరకు పొడిగించింది. ఈ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.