calender_icon.png 21 January, 2026 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఎన్జీవో క్యాలెండర్ ఆవిష్కరణ

20-01-2026 12:00:00 AM

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆవిష్కరణ

హైదరాబాద్, జనవరి 19 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ అధికారుల సంఘం హైదరాబాద్ జిల్లా యూనిట్ నూతన డైరీ, క్యాలెండర్‌ను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తన నివాసంలో సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారమ్ జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్), అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, ఎం. సత్యనారాయణగౌడ్ పాల్గొన్నా రు. మారమ్ జగదీశ్వర్ ఉద్యోగులకు కరువు భత్యం విడుదల చేసినందుకు స్పీకర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూనే, ఇతర పెండింగ్ సమ స్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.

ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేనీ (ముజీబ్) హైదరాబాద్ జిల్లా, సిటీ బ్రాంచ్ యూనిట్‌లకు కేటాయించిన స్థలాల అంశాన్ని  స్పీకర్ దృష్టికి తీసుకు వచ్చారు. స్పీకర్ సానుకూలంగా స్పందిస్తూ, రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అన్ని సమస్యలను దశలవారీగా త్వరలోనే పరిష్కరిస్తామని, యూ నియన్లకు భూమి కేటాయింపు ప్రక్రియను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమం లో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, జిల్లా కార్యదర్శి కుర్రాడి శ్రీనివాస్, రాష్ర్ట క్లాస్- 4 ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, సిటీ అధ్యక్షులు కె శ్రీకాంత్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు రామ్ కిషన్, కేంద్ర సంఘం నాయకులు కొండల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శైలజ, జిల్లా కార్యవర్గ సభ్యులు కె.ఆర్. రాజ్ కుమార్, జె. బాల్‌రాజ్, ఒమర్ ఖాన్, ఖలీద్ అహ్మద్, బి శంకర్, వైదిక్ శ్రేష్ట, ముఖీమ్ ఖురేషి, ఏ.వి. శ్రీధర్, మాజీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.