మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని నిద్రలేపుతాం
కాంగ్రెస్ అరాచకాలకు పుల్‌స్టాప్ పెడతాం : బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు
గోపాలపేట, డిసెంబర్4: తెలంగాణ రాష్ట్రంలో మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి నిద్ర లేపుతామని బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు గట్టు యాదవ్ ఘాటుగా విమర్శించారు. గురువారం గోపాలపేట మండల కేంద్రంలో జిల్లా టిఆర్‌ఎస్ నాయకులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ. ఎమ్మెల్యే మెగా రెడ్డి అండదండలతో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవాలని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ దాడులు నిర్వహిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యంగా ఎటు చూసినా టిఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఇనామస్ లను జీర్ణించుకోలేక ఈర్షతో ఎమ్మెల్యే మెగా రెడ్డి ఎత్తుగడలు వేస్తున్నారని వేస్తున్నారన్నారు. వనపర్తి నియోజకవర్గంలో ఎక్కువ గ్రామాలలో సర్పంచ్లను గెలుచుకుంటామని ఎమ్మెల్యేకు స్నేహపూర్తంగా సవాల్ విసిరారు.
గోపాలపేట సర్పంచ్ టిఆర్‌ఎస్ పార్టీ మహిళా స్వప్న భాస్కర్ గెలుచుకుంటుందని ఈర్షతో హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న తన భర్తను ఎమ్మెల్యే సస్పెండ్ చేయించడమేంటని ఆగ్రహించారు. ఎమ్మెల్యే మీ సొంత గ్రామం లోనే నీవు నీ పార్టీ అభ్యర్థిని ఇనామస్ చేయించుకోలేకపోయామని అన్నారు.
బిఆర్‌ఎస్ అభ్యర్థి ఇనామస్ అయితే నీ అనుచరులు కాంగ్రెస్ కండువా కప్పి ఇతడు మా వ్యక్తి అని చాటింపులు చేసుకోవడం సరికాదన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు మాజీ జెడ్పిటిసిలు గోపాలపేట సర్పంచ్ అభ్యర్థి కర్రోళ్ల స్వప్న మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు ఎద్దుల గోపాల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






