05-12-2025 12:00:00 AM
కల్వకుర్తి టౌన్ డిసెంబర్ 4 : ప్రమాదవశత్తు అదుపుతప్పి ఇంట్లోకి ట్రాక్టర్ దూసుకెల్లడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం గురువారం మధ్యాహ్నం కల్వకుర్తి పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో రాయి లోడ్ తో వెళుతున్న ట్రాక్టర్ అద్భుతప్పి నారాయణమూర్తి అనే వ్యక్తి అద్దెకు ఉంటున్న ఇంటిలోనికి ట్రాక్టర్ దూసుకెళ్లిందని, సంఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఎవరులేరని దీంతో పెను ప్రమాదం తప్పిందని వారు తెలిపారు. ఇల్లు ధ్వజమైందని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదన్నారు. అనంతరం స్థానికులు సాయక చర్యలు చేపట్టారు.