13-02-2026 01:11:36 AM
మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కాగజ్నగర్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): కాగజ్నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు అధికా ర కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ పార్టీలు లోపాయికారీ ఒప్పందాలతో కుమ్మక్కై ప్రచారం నిర్వహిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్ పార్టీనే కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గురువారం తన నివాసంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి ఎన్ని జిమ్మిక్కులు చేసినా కాగజ్నగర్లో గెలుపు బి ఆర్ ఎస్ కు దక్కుతుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు.