23-02-2026 01:53:24 AM
చర్మ, జుట్టు, ఎస్థెటిక్ సేవలకు నూతన దిశ
డాక్టర్ మనీషామారెడ్డి ఆధ్వర్యంలో వెల్నెస్ కేంద్రం ప్రారంభం
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): కోకాపేట్‌లోని ఎంఎన్ క్యాపిటల్ భవనం, 3వ అంతస్తులో ష్లోక్ డిటర్‌మెటాలజీ, వెల్‌నెస్ కేంద్రాన్ని ఆదివాంర ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ కాస్మెటిక్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ మనీషా మారెడ్డి స్థాపించిన ఈ కేంద్రం, శాస్త్రీయ ఆధారిత, నైతిక విధానంతో కూడిన చర్మ, జుట్టు, ఎస్థెటిక్ చికిత్సల ను సమగ్రంగా అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మోకాలి, నడుము, భుజ శస్త్రచికిత్స నిపు ణులు డాక్టర్ అరుణ్‌రెడ్డి మల్లు, రవి హైటెక్ డైరెక్టర్, రవికాంత్‌రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ రాజేశ్వరి, ఎఐడబ్ల్యూఏ కార్యదర్శి మల్లు లక్ష్మి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ష్లోక్ కేం ద్రంలో హెయిర్ రీస్టోరేషన్ (పీఆర్పీ, జీఎఫ్‌సీ, ఎక్సోసోమ్ థెరపీ), ఫేషియల్ రీజువె నేషన్, లేజర్ చికిత్సలు, హెచ్‌ఐఎఫ్‌యూ, మైక్రోనీడ్లింగ్, మొటిమలు, పిగ్మెంటేషన్, సోరియాసిస్, ఎగ్జిమా, జుట్టు సమస్యలు వంటి మెడికల్ డెర్మటాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. డా.మనీషామారెడ్డి మాట్లాడుతూ, చర్మం ఆరోగ్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబంమన్నారు. సురక్షిత మైన, శాస్త్రీయవిధానాలతో సహజమైన ఫలితాలు అందించడమే లక్ష్యమన్నారు.