23-02-2026 01:56:39 AM
బీసీలపై రెడ్లు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేస్తారా?
నాగర్‌కర్నూల్ పోలీసులను నిలదీసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ ముందు ధర్నా
అక్కడి నుంచి పాదయాత్రగా కుమ్మెరలో నిందితుల ఇంటికి
బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల ఆర్థిక సాయం
నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో బీసీలపై జరిగిన దాడిపై ఎమ్మెల్సీ, టీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న స్పందించారు. ఆదివా రం నాగర్‌కర్నూల్ వెళ్లిన తీన్మాన్ మల్లన్న.. నిందితులపై ఫిర్యాదు చేసినా ఎం దుకు కేసు నమోదు చేయలేదని పోలీసులను నిలదీశారు. కోర్టు అనుమతి కోసం పంపామని పోలీసులు చెప్పడం తో.. బీసీ బిడ్డలంటే లెక్క లేదా? రెడ్లపై కేసు నమోదు చేయాలంటే కోర్టు అనుమతి కావాల్నా! అని నిలదీశారు. మొదట బాధిత కుటుంబ సభ్యులతో కలిసి నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన మల్లన్న..
దాడికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మల్లన్న డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు. ఎఫ్‌ఐఆర్ నమోదు విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, నిందితులకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపిం చారు. నేరస్థులను పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.
పోలీసుల నిర్లక్ష్య వైఖ రిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేశారు. అనంతరం అక్కడి నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుమ్మెర గ్రామానికి కాలినడకన వెళ్లి బాధిత కుటుంబ ఇంటికి వెళ్లి, మళ్లీ పరామర్శించారు. చిన్నారి సమాధి ప్రదేశానికి వెళ్లి నివాళులు అర్పించారు. ఆ తర్వాత చిన్నారి మృతికి కారకులైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లగా తాళాలు వేసి ఉండటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎక్కడ దాక్కున్నా చట్టం ముం దు నిలబెట్టే వరకు ఊరుకోనని, దమ్ముంటే తన ముందుకు వచ్చి నిలబడాలి అంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను ఓదా ర్చి, వారికి ధైర్యం చెప్పారు. నిందితులు ఎం త ప్రభావశీలులైనా, చట్టం ముందు నిలబెట్టే వరకు పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముక్కు నేలకు రాయాలి..
కుమ్మెర గ్రామంలో రజకులపై జరిగిన దాడిలో పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని తీన్మార్ మల్లన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికార పార్టీనాయకులు స్పందించకపోవడం, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో విఫలమవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్‌కర్నూలు జిల్లాలో రెడ్ల రాజ్యం రాజ్యమేలుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు నడిచౌరస్తాలో ప్రజలకు సమాధానం చెప్పాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణ భద్రత కాపాడలేని నాయకత్వానికి పదవుల్లో ఉండే హక్కు లేదని, నాగర్‌కర్నూల్ నడిచౌరస్తాలో ముక్కు నేలకు రాయాలని, ఇద్దరూ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కులం పేరుతో అన్యాయం ఆగాలి..
సమాజంలో కులం పేరుతో జరుగుతున్న దాడులు, అన్యాయాలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్ట అమలు అవసరమని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లప్పుడూ బాధితుల పక్షాన నిలు స్తుందని స్పష్టం చేశారు. మల్లన్న వెంట తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా నాయ కులు, కార్యకర్తలు, బీసీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపారు.