తడిపొడి చెత్త వేరు చేయాలి
వేములవాడ, మార్చి 17, (విజయక్రాంతి )వేములవాడ పట్టణ పరిశుభ్రతకు ప్రజల సహకారం అవసరమని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చే సి మున్సిపల్ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు.ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా వేములవాడ మండలం, తెట్టెకుంట శివారులోని పొడి వనరుల సేకరణ కేంద్రంలో నూతన యం త్రా లను మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజుతో కలిసి ప్రారంభించారు.
చెత్తను శాస్త్రీయంగా ప్రాసెస్ చేసి కంపోస్ట్ తయారు చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతుందని తెలిపారు. ఈ కేంద్రంలో బేలింగ్, వెయిమెంట్ మెషీన్లు ఏర్పాటు చేసి రోజుకు 15 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో పనిచేస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కొక్కుల బాలకృష్ణ, అన్నారం శ్రీనివాస్, తూమ్ మధు, ఎల్ల శ్రీనివాస్, తోట రాజు, కాషా శ్రీనివాస్, మూడపల్లి నీలమ్మ, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




