18 March, 2026 | 2:22 AM

ఆయిల్ పామ్‌కు ప్రోత్సాహం

18-03-2026 12:45 AM

ఇల్లంతకుంట, మార్చి 17(విజయక్రాంతి): ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా ఇల్లంతకుంట, బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ, గంభీరావుపేట మండలాల్లో 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు పొందవచ్చని తెలిపారు. అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం సాధ్యమని, డ్రిప్ ఇరిగేషన్, సబ్సిడీలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పంట కొనుగోలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు.కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.