28 June, 2026 | 12:08 PM

Breaking News

రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •   ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా కొత్తగూడెం   •   కారు, లారీ ఢీకొని యువకుడు మృతి   •   విద్యుదుఘతంతో వాటర్ పిల్టర్ టెక్నిషియాన్ మృతి   •   ఆర్‌ఎస్‌పీ భద్రత తగ్గింపు కక్ష సాధింపు చర్యే   •  

వ్యాట్ ఏ జోడీ

12-06-2024 12:45 AM

లండన్: ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేనియల్ వ్యాట్.. తన ప్రేయసి జార్జి హాడ్జ్‌ను వివాహం చేసుకుంది. గతంలో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కిన వ్యాట్.. నిరుడు ప్రేయసితో ఎంగేజ్‌మెంట్ చేసుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. తాజాగా లండన్‌లోని చెల్సియాలో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 33 ఏళ్ల వ్యాట్ ఇంగ్లండ్ తరఫున 105 వన్డేలు, 151 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. జార్జి హాడ్జ్ సీఏఏకు చెందిన ఓ మహిళా ఫుట్‌బాల్ జట్టు హెడ్‌గా కొనసాగుతోంది. ఇంగ్లండ్ జట్టులో గతంలో కేథరిన్ బ్రంట్, నటాలియా స్కీవర్ పెళ్లి చేసుకోగా.. ఇప్పుడు వ్యాట్ ఆ జాబితాలో చేరింది. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి జోడీలు చాలానే ఉన్నాయి. న్యూజిలాండ్ ప్లేయర్ అమీ సాటర్‌వైట్ దక్షిణాఫ్రికా ప్లేయర్ మరీనే కాప్, నికెర్క్ కూడా వివాహ బంధంతో ఒక్కటయ్యారు.