21 August, 2026 | 7:03 PM

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం

21-08-2026 06:30 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని అల్లిపురం గ్రామ సర్పంచ్ బోగాల జ్యోతి పిచ్చిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వపల్లి తండా సర్పంచ్ మాలోతు సక్రు నాయక్ ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను శుక్రవారం లబ్దిదారులు అయిన బజ్జూరి  గురవయ్య రూ.36000, కొమ్మనబోయిన బ్రహ్మయ్య రూ.19000, పట్టేటి రపేలు రూ.60000 వారికి అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తుందని తెలిపారు.ప్రజల ఆరోగ్యానికి, సంక్షేమానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అల్లిపురం గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లికంటి నాగేశ్వరావు,ఉపసర్పంచ్ మాలిరెడ్డి వీరారెడ్డి  పాల్గొన్నారు.