calender_icon.png 9 December, 2025 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతం వెనుక వాస్తవాలేంటి?

09-12-2025 02:11:51 AM

చారిత్రక ఘటనలు ఏం చెప్తున్నాయి?

న్యూఢిల్లీ, డిసెంబర్ 8: జాతీయ గీతం ‘వందేమాతరం’ 150వ ఉత్సవాల సందర్భంగా పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ముస్లిం లీగ్‌కు లొంగిపోయి నెహ్రూ గీతాన్ని రెండు చరణాలకు కుదించారని ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో నెహ్రూ నాడు ముస్లింలను, ముస్లిం లీగ్‌ను సంతృప్తిపరిచేందుకే గీతాన్ని కుదించారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు వాస్తవంలో జరిగిందేంటి? అన్న ఆసక్తి దేశ ప్రజల్లో నెలకొం ది. బంకిం చంద్రచటర్జీ 1875లో ఈ గీతాన్ని రాసి, తర్వాత తన ‘ఆనంద్‌మఠ్’ నవలలో చేర్చారు. కొందరు హిందూ సన్యాసులు ఒక్కటై ఓ ముస్లిం రాజుపై పోరాటం చేయ డం నవల సారాంశం. గీతంలోని మొదటి రెండు చరణాలు మాతృభూమి గొప్పదనా న్ని కీర్తించాయి. మిగతా చరణాలు ముస్లిం మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉంటాయనే అభిప్రాయం స్వతంత్ర సమరయోధుల్లో ప్రబలంగా ఉండేది. 19-30లలో దేశంలో మత ఘర్షణలు జరిగాయి. నాడు ఒకవర్గం ‘వందేమాతరం’ నినాదాన్ని వినియోగించేది.

మరో వర్గం కూడా మరోరకమైన నినాదాన్ని ప్రచారం చేసేవి. దీంతో రెండువర్గాల మధ్య తరచూ ఘర్షణలు సంభవించేవి. నెహ్రూ ఈ క్రమంలోనే ఠాగూర్‌ను సలహా అడిగారు. గీతంలోని మొదటి రెండు చరణాలు మాతృభూమిని కీర్తిస్తున్నాయని, మిగిలిన చరణాలను వేరు చేయవచ్చని నెహ్రూకు ఠాగూర్ సూచించారు.

చివరికి, 1937లో గాంధీ, నెహ్రూ, పటేల్, ఆజాద్ వంటి పెద్ద నాయకులు కలిసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో వందేమాతరం మొదటి రెండు చరణాలను మాత్రమే పాడాలని వారంతా నిర్ణయించారు. ఇదంతా బహిరంగంగా జరిగిందే. దీనిలో దాపరికమేమీ లేదు. 1950లో రాజ్యాంగ పరిషత్తు కూడా రెండు చరణాల గీతానికే జాతీయ గీతం హోదా కల్పించిన సంగతి తెలిసిందే.