09-12-2025 02:16:50 AM
సునామీ హెచ్చరికల జారీ
టోక్యో, డిసెంబర్ 8: జపాన్ ఉత్తర ప్రాం తంలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 7.6 తీవ్రత నమో దైంది. హొక్కుడో ద్వీపం సమీపంలోని సముద్రంలో 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉంది.
దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు సైతం జారీ చేసింది. ప్రకంపనల కారణంగా అమోరి, హొక్కుడో సముద్ర తీరాల్లో 10 అడుగుల వరకు మేర అలలు విరుచుకుపడ్డాయి. నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ఆ దేశ ప్రధాని తకాయిచి స్పష్టం చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణు విద్యుత్ కేంద్రాల్లోని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు.