21 May, 2026 | 8:10 AM

అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు జీతాలేవి?

19-06-2024 12:58 AM

బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారిందని బీఆర్‌ఎస్ నేత దేవీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. అంగ న్‌వాడీలకు సకాలంలో వేతనాలు అందడంలేదని, కిందిస్థాయి ఉద్యోగులకు జీతాలు అందేలా పనిచే యాలని మంత్రి శ్రీధర్‌బాబుకు సూచించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం మాట్లాడుతూ.. మాజీ మంత్రి హారీశ్‌రావు అడిగిన 4 ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్ప కుండా దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని, ఆశావర్కర్లను గుర్రాలతో తొక్కించిన చరిత్ర ఎవరిదో తెలుసుకుని మాట్లాడాలని హితువు పలి కారు.

అంగన్‌వాడీలకు దేశంలో ఎక్కడలేని విధంగా ఎక్కువ వేతనం పెంచిన ప్రభుత్వం బీఆర్‌ఎస్ అనే సంగతి మరిచిపోవద్దన్నారు. ప్రభు త్వం జీతాలు చెల్లిస్తే ఆశావర్కర్లు, అంగన్‌వాడీలు రోడ్లపైకి వచ్చి ఎం దుకు ధర్నాలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఒకటో తేదీన వేతనాలు చెల్లి స్తున్నామని ప్రభుత్వం చెబుతుంటే విమర్శలు ఎందుకు వస్తున్నాయని నిలదీశారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.1,500 నుంచి రూ.9,700కు ఆశావర్కర్లకు, రూ.4వేల నుంచి రూ.13,850 వరకు అంగన్‌వాడీలకు పెంచామని తెలిపారు. ప్రతిపక్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, అనేక సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్నామన్నారు.