ప్రజావాణికి వినతుల వెల్లువ
19-06-2024 12:56 AM
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజలు భారీ గా తరలివచ్చారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి వారి నుంచి వినతులను స్వీక రించారు. మొత్తం 607 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూపరమైన సమస్యలకు సంబంధించినవి 176 కాగా, హౌజింగ్‌కు సంబంధించినవి 58 దరఖాస్తులు ఉన్నాయి. పౌరసరఫరాల శాఖకు సంబంధించి 54, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించి 36, హోం శాఖకు చెందిన ఫిర్యాదులు 62, ఇతర శాఖలకు సంబంధించిన దరఖాస్తులు, 221 వచ్చినట్లు అధికారులు తెలిపారు.






