వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?
వికలాంగుల జిల్లా అధ్యక్షులు మీర్ గియాజ్ ఉద్దీన్
చేగుంట: వికలాంగుల 6 వేల పెన్షన్ హామీ ఏమైందని, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి (టిఆర్విఎస్) మెదక్ జిల్లా అధ్య క్షుడు మీర్ గియాజ్ ఉద్దీన్ నేడు చేగుంట లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా పెంపు ఊసే ఎత్తడం లేదని అన్నారు. గత సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా 44,49,767 మందికి పెన్షన్ రాగా, ప్రస్తుతం 42,80,129 మందికి మాత్రమే వస్తుందని ఆవేదన వ్యక్తంచే శారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగుల పెన్షన్ల పెంపునకు నిధులను కేటాయించ లేదు అని . దివ్యాంగులకు ఇస్తామన్న పెన్షన్ పెంచి, ఉద్యోగ, ఉపాధి తో దివ్యాంగుల సమాజాన్ని ఆదుకోవాలని వారు అన్నారు .




