04-11-2025 12:53:07 AM
							టెక్ట్స్ మెసేజెస్ ద్వారా ఉద్యోగులకు లేఆఫ్స్ సందేశం
న్యూఢిల్లీ, నవంబర్ 3: ప్రపంచవ్యాప్తంగా ఏఐ దూకుడు కారణంగా ఉద్యోగాలు ఆవిరైపోతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా 14 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ఇచ్చేసింది. ఉద్యోగుల్ని సాగనంపేందుకు రెండు రకాల మెసేజ్ లు పంపింది.
తెల్లవారుజామున ఉద్యోగులు నిద్రలేచే సరికి రెండు మెసేజ్‌లు వారి ఫోన్లలో కనిపించాయి. ఒక సందేశం వెంటనే ఈ- మెయిల్స్ చెక్ చేసుకోవాలని, ఈ- మెయిల్ అందకుంటే హెల్ప్ డెస్క్‌కాల్ చేయాలనేది రెండో సందేశం. అంటే.. మెయిల్ ద్వారా లేఆఫ్స్ చేశామని.. దానిని టెక్ట్స్ మెసేజెస్ ద్వారా ధ్రువీకరించుకోవాలని అమెజాన్ చెప్పిందన్నమాట.