04-11-2025 04:43:03 PM
							న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి హిందూజా (85) మంగళవారం కన్నుమూశారు. వ్యాపార వర్గాలలో 'జీపీ'గా పేరొందిన గోపీచంద్ పి.హిందూజా గత కొన్నిరోజలుగా అనారోగ్యంతో బాధపడుతూ లండన్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. హిందూజా కుటుంబంలోని రెండవ తరానికి చెందిన గోపీచంద్, మే 2023లో తన అన్నయ్య శ్రీచంద్ మరణించిన తరువాత గోపిచంద్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు భార్య సునీత, కుమారులు సంజయ్, ధీరజ్, కుమార్తె రీటా ఉన్నారు.