16 July, 2026 | 10:06 PM

అలాంటి కోరిక ఇప్పుడేంటో?

11-06-2024 12:20 AM

హీరో, హీరోయిన్ల డ్రీమ్ రోల్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే చాలా మంది నటీనటులు డ్రీమ్ రోల్ చేయకుండానే కెరీర్ ముగించిన సందర్భాలెన్నో! కాగా, అందాల భామ అనన్య పాండే డ్రీమ్ రోల్ గురించిన చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బాలీవుడ్ స్టార్ కిడ్ అయిన ఈ అమ్మడు హీరోయిన్‌గా అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ‘లైగర్’లో విజయ్ దేవరకొండతో జతకట్టిన ఈ సొగసరికి మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ఎలాంటి ఆఫర్లూ ఆమెకు దక్కలేదు.

బాలీవుడ్‌లో మాత్రం వరుస అవకాశాలతో బిజీగా మారింది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా సంస్థతో అనన్య పాండే ముచ్చటిస్తూ.. తన డ్రీమ్ రోల్ గురించి చెప్పింది. తమిళ హీరో దళపతి విజయ్‌తో కలిసి నటించాలని ఉందంటూ మనసులోని మాటను బయటపెట్టింది. అటు చూస్తే విజయ్ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో  అనన్య పాండే మనసులో ఇలాంటి కోరిక పుట్టడం వెనుక మరేదైనా మర్మం దాగి ఉందా?! అని అంతా ఆలోచనలో పడ్డారు.