17 April, 2026 | 4:54 PM

కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు?

05-06-2025 12:07 AM

- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 

ముషీరాబాద్, జూన్ 4: మాజీ సీఎం కేసీఆర్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందని మండిపడ్డారు.

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటే మొత్తం తెలంగాణకు ఇచ్చినట్లేనని అభివర్ణించారు. కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్, రాజకీయ కమిషన్ అని విమర్శించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద నిర్వహించిన మహా ధర్నాలో కవిత మాట్లాడారు. కేసీఆర్‌ను బద్నాం చేయడానికి మాత్రమే కాళేశ్వరం కమిషన్ వేశారని ఆరోపించారు.