17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలి

05-06-2025 12:06 AM

టీయూడబ్ల్యూజే, ఐజేయూ  ఆధ్వర్యంలో డీఈఓకు వినతి  

నల్లగొండ టౌన్, జూన్ 4 :నల్గొండ జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారి పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (ఐజేయు)జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి, జర్నలిస్టు సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం డీఈవో బిక్షపతికి వినతిపత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన డిఈఓ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టుల పిల్లలకు 50 శాతం రాయితీ ఇప్పించేందుకు అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో అమలయ్యేందుకు  కృషి చేస్తానని డిఇఓ హామీ ఇచ్చారు. ఏదైనా పాఠశాల యజమాన్యం వినకపోతే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.   

వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని అధికారులను వెంటనే ఆదేశించారు. డీఈఓ కు వినతి పత్రం సమర్పించిన వారిలో ప్రెస్ క్లబ్ జిల్లా అధ్యక్షులు మాదరి యాదగిరి, జిల్లా నాయకులు పులిమామిడి మహేంద్ర రెడ్డి, టౌన్ ప్రెస్ క్లబ్  అధ్యక్షులు ఏరెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, జర్నలిస్టులు గంగాధర్ వెంకటేశ్వర్లు, సోమ చంద్రశేఖర్, జిల్లా యాదయ్య, అంజయ్య, అశోక్, తెలుగ మల్ల దశరథ, రాంప్రసాద్, ఊర రమేష్ ఉన్నారు.