19 April, 2026 | 3:19 PM

మేమెంత శాతం ఉన్నామో మాకంత వాటా ఇవ్వాల్సిందే

08-12-2024 10:51 PM

కడియం రామాచారి...

భద్రాచలం (విజయక్రాంతి): రాష్ట్రంలో బీసీలు ఎంత శాతం ఉన్నారో మాకంత వాటా ఇవ్వాల్సిందేనని బీసీ సంఘం నాయకులు కడియం రామాచారి, తాళ్ల రవికుమార్, బండ నాగేశ్వరరావు, అనుకోజు నరసింహ చారి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక  గోల్డ్ స్మిత్ కాలనీలోని వీర బ్రహ్మంగారి కళ్యాణమండపంలో జరిగిన బిసి ఐక్యవేదిక సమావేశంలో (33 కులాల కన్వీనర్ల) వారు పాల్గొని మాట్లాడుతూ.. ఈ 75 సంవత్సరాల నుండి బీసీ లకు తీవ్రంగా అన్యాయం జరిగిందని, ఇప్పుడు బీసీలు చైతన్యం అయ్యారని వచ్చే ఎన్నికల్లో బిసిలకు రాజకీయ పార్టీలు సరియైన ప్రాధాన్యత ఇవ్వని పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ డబ్ల్యూ ఎస్ స్కీంను వెంటనే తొలిగించాలని ధీనివల్ల బీసీ బిడ్డలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో బీసీ ఐక్యవేదిక బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ కమిటీ తీర్మానం చేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు బోలిశెట్టి రంగారావు, కోపనాటి శాంతారావు, కొమ్మనాపల్లి రమణ, ఏకుల రామచంద్రరావు, ఆనుమల్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.