ఆధ్యాత్మికతతోనే ప్రశాంత...
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్...
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ప్రశాంత జీవనం గడపాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షదారుల నేతృత్వంలో జరుగుతున్న ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముందుగా చైర్మన్ అయ్యప్ప స్వామిని దర్శించుకుని పూజలు చేసి, వేద పండితుల ఆశీర్వచనాలను స్వీకరించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన మహా అన్నదాన ప్రసాదం కార్యక్రమంలో పాల్గొన్నారు. 41 రోజుల పాటు అయ్యప్ప స్వాములు కఠోర నియమ నిష్టలతో దీక్షలను ఆచరిస్తారని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. భక్తి భావనతో స్వామివారిని కోలుస్తారని, అయ్యప్ప కృపతో ప్రజలంతా సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు.






