కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న
08-12-2024 10:32 PM
కాంగ్రెస్ కార్యకర్త ఇంట్లో పట్నంలో దుద్దిళ్ల శ్రీనుబాబు
మంథని (విజయక్రాంతి): కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం కొమురవెల్లి మల్లన్న దేవుడిని కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. ఆదివారం మండలం పన్నూరు గ్రామంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త గాజుల భూమయ్య గౌడ్ స్వగృహంలో మల్లన్న దేవుని పట్నాలలో శ్రీనుబాబు పాల్గొన్నారు. మల్లన్న స్వామి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీనుబాబు ఆకాంక్షించారు.






