calender_icon.png 5 May, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీధర్‌బాబు సీఎం కావాలని అర్వింద్ కోరుకోవడంలో తప్పేముంది!

12-04-2025 12:00:00 AM

  1. శ్రీధర్‌బాబుకు బీజేపీ ఎంపీ అర్వింద్ మంచిమిత్రుడు 
  2. కేసీఆర్‌కు కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం లేదు 
  3. మీడియా అడిగిన ప్రశ్నలకు పీసీసీ చీఫ్ సమాధానం   

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కావాలని బీజేపీ ఎంపీ అర్వింద్‌కుమార్ కోరుకోవడంలో తప్పేముందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి శ్రీధర్‌బాబును సీఎంను చేయాలని ఉందని, ఆయనకు వసూళ్లు చేయడం రాదనే సీఎం చేయడంలేదని బీజేపీ ఎంపీ అర్వింద్‌కుమార్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రశ్నించగా మహేశ్‌కుమార్‌గౌడ్ పైవిధంగా సమాధానమిచ్చారు.

మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ ఎంపీ అర్వింద్‌కుమార్ మంచి స్నేహితులని తెలిపారు. అర్వింద్‌కుమార్ తండ్రి డీ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడేనని మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు కృషి ఉందన్నారు. బీసీలకు న్యాయం చేయాలని బీజేపీలోని బీసీ నాయకులు అర్వింద్, ఈటల , లక్ష్మణ్ ఎందుకు ప్రయత్నం చేయడం లేదని నిలదీశారు.