12-04-2025 12:00:00 AM
నల్లగొండ, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. రైతు సంఘం ఆవిర్భావ దినోత్సవం సంద ర్భంగా శుక్రవారం నల్లగొండలోని రైతు సంఘం జిల్లా కార్యాలయంలో సంఘం జెండాను ఆయన ఆవిష్కరించి మాట్లా డారు. 1936 ఏప్రిల్ 11న రైతు సంఘం ఏర్పడిందని గుర్తు చేశారు.
రైతులు, కార్మి కులు, గ్రామీణ పేదలను సంఘటితం చేసి వారి సమస్యల పరిష్కారం కోసం పోరా టాలు చేసేందుకు ఈ సంఘం ఏర్పడిందని తెలిపారు. ఆనాటి నుంచి నేటి వరకు రైతు సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.
యాసంగిలో మిల్లర్లు అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండా శ్రీశైలం, కుంభం కృష్ణారెడ్డి, ఊట్కూరు మధుసూదన్ రెడ్డి, నకిరేకంటి జానయ్య తదితరులు పాల్గొన్నారు.