calender_icon.png 5 May, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉస్మానియా హాస్పిటల్ వరల్డ్ ఫేమస్

12-04-2025 12:00:00 AM

గోషామహల్‌లో రూ.2700కోట్లతో ఆస్పత్రి

మెడికోల కోసం రూ.210 కోట్లతో హాస్టల్

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): ఉస్మానియా హాస్పిటల్, మెడికల్ కాలేజీ వరల్డ్ ఫేమస్ అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. కోట్లాది మంది రోగుల ఆశాదీపం ఉస్మానియా ఆస్పత్రి అని చెప్పారు. శుక్రవారం ఉస్మానియా మెడికల్ కాలేజీ విద్యార్థుల 174వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెడి సిన్ పూర్తి చేసుకుని వైద్యరంగంలోకి అడుగుపెడుతున్న వారికి శుభా కాం క్షలు తెలిపారు.

సర్వీస్ ఓరియెంటెడ్‌గా ఉండాలని, సామాన్యులను దోపిడీ చేయొద్దని కోరారు. దశాబ్దాలుగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రికి నూతన భవనం ఆకాంక్షను తమ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. గోషామహల్‌లో రూ.2,700 కోట్లతో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించబోతున్నట్టు చెప్పారు. ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీల్లో మెడికోల కోసం రూ.210 కోట్లతో అత్యాధునిక వసతులతో హాస్టళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు.