09-02-2026 12:04:38 AM
ఎక్కడ మనసు- భయం లేకుండా ఉంటుందో
ఎక్కడ మనిషి తలయెత్తుకుని బతుకుతాడో
ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా వర్ధిల్లుతుందో
ఎక్కడ ప్రపంచం ఇరుకైన ఇంటి బంధాల గోడలతో
ముక్కలు ముక్కలుగా విడిపోవడం లేదో
ఎక్కడ మాటలు- సత్యం గుండె లోతు
నుంచి బయటకు వస్తాయో
ఎక్కడ అలుపులేని శ్రమ
సంపూర్ణత వైపు చేతులను చాస్తుందో
ఎక్కడ తర్కవివేక నిర్మల స్రవంతి-
అంధాచారాల నిస్తేజ
నిరాశాజనితపు ఎడారి యిసుకలోనికి
దారి కోల్పోయి వెళ్లిపోదో
ఎక్కడ నీ మనసు-
ఎప్పుడూ విశాలమవుతూ
విస్తరిస్తుండే ఆలోచనలతో
వాటి ఆచరణలతో ముందుకు వెళుతుందో
ఆ స్వేచ్ఛామయస్వర్గంలోకి
ఓ జగత్పితా, నా దేశాన్ని మేల్కోనివ్వు!!
‘రఘువర్మ’
ఆంగ్లమూలం:
రవీంద్రనాథ్ ఠాగూర్
(వేర్ ది మైండ్ ఈజ్)