28-10-2025 12:00:00 AM
అల్లరి నరేశ్ నటించిన థ్రిల్లర్ మూవీ ‘12 ఏ రైల్వే కాలనీ’ ఇప్పటికే నిర్మాణ పనులు పూర్తి చేసుకుంది. పొలిమేర, పొలిమేర2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆయనే ఎడిటర్ కూడా. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ సోమవారం ప్రకటించారు.
నవంబర్ 21న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేశ్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫోజ్‌లో కనిపించారు. ఈ సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో సైతం ఆకట్టుకుంటోంది. నరేశ్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తుండగా, డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో ఇంకా సాయికుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్‌కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; సినిమాటోగ్రఫీ: కుశేంద్ర రమేశ్‌రెడ్డి.