27-10-2025 01:00:56 AM
రష్మిక మందన్న భారతీయ చత్రసీమలో తొమ్మిదేళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఈ మొత్తం కెరీర్‌లో నాలుగు భాషల్లో 25 సినిమాల్లో నటించింది రష్మిక. ఈ సినిమాల్లో హిట్స్, సూపర్‌హిట్స్, బ్లాక్‌బస్టర్స్‌తోపాటు బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన సినిమాలెన్నో ఉండటం విశేషం. హీరోయిన్లు ప్రాంతీయంగా పేరు తెచ్చుకోవడం సర్వసాధారణం. కానీ, రష్మిక.. పాన్ ఇండియా స్థాయిలో వరుస విజయాలు అందుకుంటూ, తన స్టార్‌డమ్ క్రేజ్ చూపించటంలో తనకు తానే సాటి అనిపించుకుంది.
అందం, నటన, ఆకర్షణతో దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మరో హీరో యిన్‌కు లేనంత క్రేజ్‌ను సొంతం చేసుకుంటోందీ ముద్దుగుమ్మ. రూ.వెయ్యి కోట్ల సినిమాలను అలవోకగా అందుకుంటూ ఇండియన్ సినిమా క్వీన్ గా మారింది. రష్మిక నటించిన పుష్ప, పుష్ప2, యానిమల్, ఛావా, థామా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేశాయి.
అయితే, బాక్సాఫీస్ నెంబర్స్ కంటే ప్రేక్షకుల ప్రేమే తనకు ముఖ్య మని చెబుతుంటుంది రష్మిక మందన్న. తన విజయాలను కొనసాగిస్తూ మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోందీ బ్యూటీ. రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్‌లో రష్మిక పర్‌ఫార్మెన్స్ మెస్మరైజ్ చేస్తోంది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తన్న ఈ సినిమాను గీతాఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పి స్తున్నారు. దీక్షిత్ శెట్టికి జంటగా నటించిన ఈ ‘ది గర్ల్‌ఫ్రెండ్’ రష్మిక కెరీర్‌లో మరో మైలురాయి చిత్రం కాబోతోందని తెలుస్తోంది. రష్మిక ఇంకా గోండ్ మహిళ నేపథ్యంలో ‘మైసా’ అనే సినిమాలోనూ నటిస్తోంది. మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ రష్మిక హీరోయిన్‌గా భాగమైంది.