బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బాన్సువాడ, జూన్ 2 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే,మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచనల మేరకు బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు.
బిఆర్ఎస్ నాయకులు జుబేర్ మాట్లాడుతూ,2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం కోట్లాది తెలంగాణ ప్రజల కల సాకారమైన చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) చేసిన పోరాటం,నాయకత్వం చిరస్మరణీయమని కొనియాడారు. తెలంగాణ ఉద్యమాన్ని విజయతీరాలకు చేర్చి రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసిన కేసీఆర్ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఏఐబీఎస్ కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్,రమేష్ యాదవ్, కౌన్సిలర్లు ఫిరోజ్ ఖాన్,మక్బూల్,మాజీ కౌన్సిలర్ బాడి శ్రీనివాస్,మాజీ వార్డు సభ్యులు అక్బర్, మైనార్టీ నాయకుడు ఇషాక్, నాయకులు ,గాండ్ల కృష్ణ,మహేష్, సయ్యద్ ఉబెద్,శేఖర్,శివ సూరి,కాసుల బాబు రావ్,సాయులు, గౌస్,మన్సుర్,గంగారాం,ఉద్యమ మ కారులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.






