14 June, 2026 | 2:25 AM

ఆడుతూ పాడుతూ

14-06-2026 12:46 AM

ఆప్ఘనిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసిం ది. ధర్మశాల వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడా తో ఘనవిజయం సాధించింది. బౌలింగ్‌లో అరంగేట్రంలోనే హర్ష దూబే, గుర్నూర్ బ్రార్ అదరగొడితే... బ్యాటింగ్‌లో శుభమన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిసాడు. 

  1. గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
  2. తొలి వన్డేలో భారత్ ఘనవిజయం
  3. ఆకట్టుకున్న హర్ష్ దూబే, బ్రార్

ధర్మశాల, జూన్ 13 : ఊహించినట్టుగానే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదిం చారు. తడిచిన పిచ్‌పై భారత బౌలర్లు అదరగొట్టారు. వారి దెబ్బకు ఆప్ఘనిస్థాన్ కేవలం 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిం ది. జడ్రాన్ (1), సెదికుల్లా (0), రహమత్ షా(3) నిరాశ పరిచారు. అయితే ఓపెనర్ గుర్బాజ్ దూకుడుగా ఆడాడు. కెప్టెన్ హస్మతుల్లా షాహిదితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 116 పరుగులు జోడించారు.

గుర్బాజ్ టీ20 తరహా బ్యాటింగ్ చేశాడు. భారీ సిక్సర్లు, ఫోర్ల తో భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కేవలం 51 బంతుల్లోనే 102 పరుగులు చేయగా.. అతని ఇన్నింగ్స్ లో 8 ఫో ర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతని జోరుకు ఆప్ఘనిస్థాన్ భారీస్కోరు చేసేలా కనిపించింది. అయితే నితీశ్ కుమార్ రెడ్డి అద్భుతమైన యార్కర్‌తో అతన్ని పెవిలియన్‌కు పంపా డు. గుర్బాజ్ వికెట్‌తోనే ఆప్ఘన్ జోరుకు బ్రేక్ పడింది. తర్వాతి బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు వరుస వికెట్లు తీసి కట్టడి చేశారు. ఫలితంగా ఆప్ఘనిస్థాన్ 194 ప రుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో హర్షదూబే, గుర్నూర్ బ్రార్ అరంగేట్రంలోనే మూడేసి వికెట్లతో ఆకట్టుకున్నారు.

అర్షదీప్ సింగ్ 2, నితీశ్ రెడ్డి రెండేసి వికెట్లు తీసారు. తర్వాత ఛేజింగ్‌లో ఓపెనర్లు రోహి త్ శర్మ, గిల్ తొలి వికెట్ కు 46 పరుగులు జోడించారు. భారీ ఇన్నింగ్స్ ఆడతాడనుకున్న రోహిత్ (16) త్వరగానే ఔటవగా.. ఇషాన్ కిషన్‌తో కలిసి గిల్ రెండో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. వన్‌డౌన్ లో వచ్చిన ఇషాన్ 34 రన్స్ చేయగా, శ్రేయాస్ అయ్యర్ (12) నిరాశపరిచాడు. అయితే గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్ ను మళ్లీ వన్ సైడ్ గా మార్చేశాడు. అటు కేఎల్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) కూడా దూకుడుగా ఆడడంతో భారత్ 22.5 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. గిల్ 66 బంతుల్లో 84 (11 ఫోర్లు, 2 సిక్సర్లు) నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల సిరీస్‌లో భారత్ 1 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం లక్నోలో జరుగుతుంది.

స్కోరు బోర్డు 

ఆప్ఘనిస్థాన్ ఇన్నింగ్స్ : 194 ( గుర్బాజ్ 102, హస్మతుల్లా 27, ఒమర్జాయ్ 26 ; గుర్నూర్ బ్రార్ 3/27, హర్ష దూబే 3/47, అర్షదీప్ 2/27,నితీష్ రెడ్డి 2/31)

భారత్ ఇన్నింగ్స్ : 195/3 ( గిల్ 84 నాటౌట్, రాహుల్ 39 నాటౌట్, ఇషాన్ కిషన్ 34;  షరీఫి 1/39, రషీద్ ఖాన్ 1/37)