calender_icon.png 3 February, 2026 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండలో ముగిసిన ఊర పండుగ సంబరాలు

03-02-2026 06:15:17 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గత నెల 30న ప్రారంభమైన దోమకొండ ఊర పండగ సంబరాలు మంగళవారంతో 5 రోజులకు చేరుకుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా కూర పండగను భక్తిశ్రద్ధలతో ఐద రోజుల పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈనెల 30న ప్రారంభమైన ఉత్సవాలు, సార్గమ్మ విగ్రహ ప్రతిష్ట, గ్రామంలోని ఊరడమ్మ వద్ద  సోమవారంతో ముగిశాయి. మంగళవారం దోమకొండ గుండ్ల చెరువు ప్రాంతంలోని కట్ట మైసమ్మ వద్ద డప్పు వాయిద్యాలతో, శివసత్తుల నాట్య నృత్యములతో, మహిళల బోనాలతో, పోతరాజుల విన్యాసాలతో, బైండ్ల వారి విన్యాసాలతో, రంగసాని సే రంగమెక్కించి బహుశా వాని వినిపించడం అందర్నీ ఆకట్టుకున్నాయి.

గ్రామంలో బోనాలను తీసుకువచ్చి కట్టమైసమ్మకు సమర్పించారు. గ్రామాన్ని చల్లగా చూడమ్మా అమ్మలగన్న అమ్మ కట్ట మైసమ్మ దీవించు అమ్మ అని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలోని భక్తులే కాకుండా వేలాది మంది భక్తులు ఇతర గ్రామాల నుండి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ 5 రోజుల పండగను గ్రామ సర్పంచ్ ఐరేని నరసయ్య పర్యవేక్షణలో కుల సంఘాల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మొత్తానికి ఐదు రోజుల దోమకొండ ఊరు పండగ గ్రామ చరిత్రలో నిలిచిపోయే విధంగా గ్రామస్తుల అన్ని కుల సంఘాల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ కుల సంఘాల సభ్యులతో పాటు, ఆయా గ్రామాల భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.