17 April, 2026 | 10:28 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఎవరికి విలన్?

05-06-2025 12:08 AM

ఇప్పటికే ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా మెప్పించిన మోహన్‌బాబు మంచు డైలాగ్ కిం గ్‌గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. ప్రస్తు తం ఆయన తన కొడుకు విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న ‘కన్నప్ప’లో ఓ కీలక పాత్ర పోషిస్తూ ఆ సినిమాకు నిర్మాతగానూ వ్యవహ రిస్తున్నారు. ఇదిలా ఉండగా, మోహన్‌బాబు ప్రతినాయకుడిగా మళ్లీ తెరపై సందడి చేయనున్నారనే వార్త సినీవర్గాల్లో వినవస్తోంది.

ఇలా అనూహ్యంగా మోహన్‌బాబు పేరు తెరపైకి రావడానికి కారణం లేకపోలేదు. ‘హనుమాన్’, ‘దసరా’ వంటి చిత్రాలతో పాన్‌ఇండియా స్థాయిలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ యువ దర్శకుడు ప్రస్తుతం నాని కథానాయకుడిగా ‘ది పారడైజ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత చిరంజీవితో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇదిలా ఉండగా శ్రీకాంత్ ఓదెల ఓ కథ వినిపించడానికి మోహన్‌బాబును ఇటీవల కలిశారు. విలన్ పాత్రలో నటించాలని ఆయన్ను ఒప్పించినట్టు సినీవర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే, మోహన్‌బాబుకు చెప్పిన స్టోరీ ఏది? మోహన్‌బాబు.. మెగాస్టార్‌కు విలన్‌గా కనిపిస్తారా? లేక నానితో ప్రతినాయకుడిగా తలపడనునన్నారా? అనేది ఆసక్తిగా మారింది. ‘బిల్లా రంగా’ చిత్రంలో చిరు, మోహన్‌బాబు పోటాపోటీగా ఫైట్ చేసిన సంగతి తెలిసిందే.

మరిప్పుడు ఈ డైలాగ్ కింగ్ మరోమారు మెగాస్టార్‌తో యాక్షన్ సీన్స్ పండించడానికి సిద్ధమవుతున్నారా? లేక నానికి విలన్‌గా మారనున్నారా? తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఏదేమైనా అటు చిరంజీవి, ఇటు నాని.. ఎవరి సినిమాలో అయినా సరే మోహన్‌బాబు విలన్‌గా కనిపిస్తే ఆ క్రేజీయే వేరు కదూ!