calender_icon.png 20 December, 2025 | 4:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుమస్తాలకు దిక్కెవరు?

20-12-2025 01:31:30 AM

  1. ఆ సంఘానికి ఎన్నికలు ఉండవా

దశాబ్దాలుగా సంఘ భవనంపై పెత్తనం

పట్టించుకోని కార్మిక సంఘాలు

ఖమ్మం, డిసెంబరు 19 (విజయక్రాంతి):  ఖమ్మం నగరంలో వ్యవసాయ మార్కెట్ మొదలుకొని  కార్పొరేట్ కంపెనీల షోరూ మ్ ల్లో,బట్టల, కిరాణా, దుకాణాలల్లో వేలమంది గుమస్తాలుగా పనిచేస్తున్నారు. తోక బెత్తెడు జీతంతో తమ కుటుంబాలను పో షించుకుంటున్నారు. కానీ ఇప్పుడు వారి భ ద్రతకు దిక్కు లేకుండా పోయే పరిస్థితి నెలకొందని కొందరు సీనియర్ గుమస్తాలు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం నగరం మూడో పట్టణ ప్రాంతంలో 1970 లో స్థాపించబడిన గుమస్తాల సంఘంకు ఆనా డు సంఘ భవనం నిర్మించుకోవడం జరిగింది.

ఈ సంఘానికి కూడా వర్తక సంఘం ఎన్నికల వలె ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించుకోవాల్సి ఉంటుందని గుమస్తాలు చెప్పు కొస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఈ సంఘానికి ఎన్నికలు జరిగిన దాఖ లాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షో రూముల్లో, బట్టల కిరాణా దుకా ణాల్లో పనిచేసే గుమస్తాలకు జీతంతో సహా పి ఎఫ్, ఈ ఎస్ ఐ వంటి కటింగులు ఉండి వారి కుటుంబాలకు కొంతమేరకు లబ్ది చేకూరుతుంది.

వ్యవసాయ మార్కెట్లో పనిచేసే గుమస్తాలకు ఇవేమీ లేకుండా ప్రతిరోజు జీవన పోరాటం చేస్తూ కుటుంబాలను పో షించుకుంటు ఖరీదు, కమిషన్ వ్యాపారులకు అండగా నిలుస్తున్న తమ బతుకులకు గ్యారంటీ లేదని వాపోతున్నారు. ఈ గుమస్తాలకు ఓ సంఘం ఉన్నప్పటికీ అది నామ మాత్రంగానే మిగిలిపోవడం పై వారు అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. అసలుకు సంఘానికి ఎన్నికలు జరగవు అన్నట్లుగా వ్యవహరిస్తూ పేద, మధ్యతరగతి గుమస్తాల కుటుంబాలతో ఆటలాడుకోవడం సమంజసం కాదని విన్నవించుకుంటున్నారు.

గుమస్తాల సంఘం అనేది ఓ చరిత్ర గలిగిన వ్యవస్థగా ఉన్నప్పటికీ దానిపై కొంతమంది వ్యక్తులే దశాబ్దాలుగా పెత్తనం చెలాయించ డం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సుమారు ఒక వెయ్యికి పైగా కుటుంబాల వారు వ్యవసాయ మార్కెట్ లో గుమస్తాలుగా పనిచే స్తూన్నారు. తమకు తెలిసి 40 ఏళ్ల నుండి సంఘానికి ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవని వారు వాబోతున్నారు.

కార్మిక సం ఘాల మంటూ గుమస్తాల వద్దనుండి సంవత్సరానికి అంతో ఇంతో డబ్బులు వసూలు చేసి వాటిని ఏమి చేశారో అనే లెక్కలు కూడా చెప్పే పరిస్థితిలో సంఘ పెద్దలు లేకపోవడం శోచనీయమని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన వారి తలరాతలు మాత్రం మారడం లేదని వాపోతున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ విధంగా జరిగితే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో నివసించే గుమస్తాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఉన్న అవి కూడా గుమస్తాల సంఘం గురిం చి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయిందని కొందరు గుమస్తాలు చెప్పుకొస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ వ్యాపార రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న గుమస్తాల ప్రాణాలకు ఖరీదు వ్యాపారులు, కమిషన్ వ్యాపా రులు ఎలాంటి భద్రత కల్పించడం లేదని వారు గుమస్తాల సంఘంలో సభ్యులుగా ఉన్న ఫలితం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

అకస్మాత్తుగా ఆ గుమస్తా మరణిస్తే కుటుంబా న్ని ఆదుకునే దిక్కు లేకుండా పోతుందని అందువల్ల గుమస్తాల హక్కులు కాపాడాలంటే ప్రతి మూడేళ్లకోసారి ఆ సంఘానికి ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలతో గుమస్తాలకు న్యాయం చేసే విధంగా ఉం టుందని వారు భావిస్తున్నారు.

ఏళ్లకు తరబడి గుమస్తాలుగా పనిచేస్తున్న తమ సం ఘానికి ఓ భవనం ఉన్నా అది కొంతమంది చేతుల్లోనే ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆ సంఘ భవనం గుమస్తాలకు మాత్రమే కాకుండా ఇతర చిన్న మధ్యతరగతి కుటుంబాల శుభ అశుభ కార్యక్ర మాలకు అద్దెలకు ఇస్తూ వాటిని ఎవరు అనుభవిస్తున్నారో వాటి లెక్క తేల్చాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.